కాకినాడలో యుద్ధ విద్యల శిక్షణ కేంద్రం: వైస్ అడ్మిరల్ అనిల్ చోప్రా
కాకినాడలో యుద్ధ విద్యల శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామని తూర్పు నౌకాదళం అధిపతి వైస్ అడ్మిరల్ అనిల్ చోప్రా తెలిపారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ, తూర్పు నౌకాదళం పరిధిలో నాలుగు వైమానిక స్థావరాలను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జనవరి 1 నుంచి విశాఖ విమానాశ్రయం నిరంతరం పని చేసేలా చర్యలు తీసుకోనున్నామని ఆయన చెప్పారు. నావికాదళం అడ్డు చెప్పడంతో విశాఖ విమానాశ్రయానికి రాత్రి సర్వీసులు లేవు. వైస్ అడ్మిరల్ అనిల్ చోప్రా తాజాగా 24 గంటలూ సర్వీసులు ఉండేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.