Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిసెంబర్ ఎనిమిది తర్వాత అన్ని విషయాలు మీకే తెలుస్తాయి: లగడపాటి

రాయల తెలంగాణ ప్రతిపాదనను అన్ని ప్రాంతాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారని విజయవాడ ఎంపీ లగడపాటి అన్నారు. అంతేకాకుండా, రాయల తెలంగాణను 250 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారని లగడపాటి చెప్పారు. వ్యక్తిగత స్వార్థం కోసమే కొందరు రాయల తెలంగాణను తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ, లగడపాటి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ముక్కలవదని... సమైక్యంగానే ఉంటుందని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి జిల్లా కూడా హైదరాబాద్ తో అనుబంధాన్ని కోరుకుంటోందని అన్నారు. రాయసీమ పౌరుషానికి ప్రతీక అని... రాయల తెలంగాణతో అక్కడి ప్రజలు చాలా బాధపడతారని తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు రాదని ముందు నుంచి చెబుతూనే ఉన్నానని అన్నారు. డిసెంబర్ 8 తర్వాత అన్ని విషయాలు మీకే తెలుస్తాయని తెలిపారు.

More Telugu News