ఇక చంద్ర విద్యుత్తు రానుంది
క్రమేపీ భూమిలాగే చంద్రుడిని కూడా ఉపయోగించుకోవాలని మన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా పథకాలను, ప్రయోగాలను చేపడుతున్నారు. చంద్రుడిపై కూరగాయలు పండించాలని ఇప్పటికే దీనికి అనుగుణంగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు ప్రారంభించారు. ఇప్పుడు చంద్రుడిపై విద్యుత్తును ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. భూమిపై ఉన్న ఇంధన వనరులన్నీ క్రమేపీ తరిగిపోతున్నాయి. అలాగే వాతావరణం సరిగా అనుకూలించకపోవడం, మేఘాలు అడ్డురావడం వంటి కారణాలవల్ల సౌరవిద్యుత్తును కూడా సరిగా ఉత్పత్తి చేయలేకున్నాము. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రుడిపై సౌరవిద్యుత్తును ఉత్పత్తి చేసి, దాన్ని భూమిపైకి ప్రసారం చేసేందుకు ఒక సరికొత్త ప్రాజెక్టుకు శాస్త్రవేత్తలు రూపకల్పన చేస్తున్నారు.
జపాన్‌కు చెందిన షిమిజు కార్పొరేషన్ నిపుణులు చంద్రుడిపైన సౌర విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఒక సరికొత్త ప్రాజెక్టును తయారుచేశారు. ఈ ప్రాజెక్టు ప్రకారం చంద్రుడి మధ్యరేఖపై 11,000 కిలోమీటర్ల పొడవునా దాదాపు 400 కిలోమీటర్ల వెడల్పుతో సౌరవిద్యుత్తు ఫలకాలను ఏర్పాటు చేస్తారు. ఈ ఫలకాలవల్ల నిరంతర విద్యుత్తు ఉత్పత్తి చేయవచ్చు. ఈ విద్యుత్తును అక్కడక్కడా ఏర్పాటు చేసిన ప్రసార కేంద్రాలకు అనుసంధానించి అతి శక్తిమంతమైన, సాంద్రత కల లేజర్లుగా మార్చి వాటిని భూమిపైకి పంపుతారు. భూమిపై సుమారు 20 కిలోమీటర్ల వ్యాసంతో ఏర్పాటు చేసిన గ్రహణ కేంద్రాలు ఆ లేజర్ విద్యుత్తును గ్రహించి విద్యుత్తుగా మార్చి ప్రసారం చేస్తాయి. ఈ ప్రాజెక్టు ఏకంగా 13,000 టెరావాట్ల (సుమారు 1300 కోట్ల మెగావాట్లు) విద్యుత్తును ఉత్పత్తి చేయగల ప్రాజెక్టు. దీన్ని 2035 సంవత్సరానికల్లా చేపట్టవచ్చని షిమిజు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.