రాయల తెలంగాణపై జగన్ ఆగ్రహం
తెలంగాణ ప్రతిపాదన వదిలిపెట్టి రాయల తెలంగాణ ప్రతిపాదనకే కేంద్రం మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమైన వార్తలు వస్తున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య శంఖారావం యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. రాయలసీమను కూడా రెండుగా చీల్చాలనుకుంటున్నారని, మిగిలిన జిల్లాలతో కలిపి రాష్ట్రానికి 'తెలంగాణ రాష్ట్రం' అని పేరు పెట్టుకుంటే ఎవరు వద్దంటారు? అని ఆయన ప్రశ్నించారు.