చెరకు ధరలపై ఒప్పందాన్ని తిరస్కరించిన భారతీయ రైతు సంఘం
ప్రైవేటు చక్కెర మిల్లుల యజమానులు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధ్య కుదిరిన ఒప్పందాన్ని భారతీయ కిసాన్ యూనియన్ తిరస్కరించింది. తమకు అందాల్సిన బకాయిల కోసం రైతుల ఆందోళన కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు. ఈ ఒప్పందం తమకు అంగీకారం కాదని, రైతుల డిమాండ్ పై ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు పెద్ద ఎత్తున రహదారుల దిగ్బంధానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు వారు తెలిపారు. ముజఫర్ నగర్ జిల్లా కార్యాలయం వద్ద బీకేయూ కార్యకర్తలు చేపట్టిన దీక్ష నేడు ఆరో రోజుకు చేరుకుంది.