Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాల నేరస్థుల వయసు ఇక 16?

బాల నేరస్థుల వయసును 18 నుంచి 16కు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. నిర్భయ అత్యాచారం కేసులో ఒక నిందితుడి వయసు 18 లోపు ఉండడంతో జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కోర్టు కేవలం మూడేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఇది జాతి జనులను నివ్వెరపరిచింది. అంత క్రూర నేరానికి ఇంత తక్కువ శిక్షా? అంటూ నిరసలు వ్యక్తమవుతున్నాయి.

పాపం నిర్భయ తల్లిదండ్రులైతే ఆ నిందితుడిని ఇతర నిందితులతో సమానంగా శిక్షించాల్సిందేనని న్యాయం కోసం పోరాడుతున్నారు. దీనిపై ఇటీవలే వారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. క్రూరమైన నేరాలలో 18 నుంచి 16 ఏళ్లలోపు దోషులకు జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద రక్షణ కల్పించకుండా.. మిగతా దోషుల్లానే (18ఏళ్లు నిండినవారు) శిక్షించేందుకు వీలు కల్పిస్తూ చట్టసవరణ చేయాలని కేంద్రం నిర్ణయించింది.

More Telugu News