6666 నంబర్ ఖరీదు రూ. 1,51,300 లక్షలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

6666 నంబర్ ఖరీదు రూ. 1,51,300 లక్షలు

ఫ్యాన్సీ నంబర్లపై ఉన్న మోజు నూజివీడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్(ఎంవీఐ) కార్యాలయానికి లక్షల రూపాయలు ఆదాయం సమకూర్చి పెట్టింది. నూజివీడు ఎంవీఐ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్లకు వేలం జరిగింది. ఏపీ సీజీ శ్రేణిలో 6666 నంబర్ కోసం వినియోగదారులు పోటీ పడ్డారు. ఏపీ సీజీ 6666 నెంబర్ దక్కించుకునేందుకు ముగ్గురు బిడ్ వేయగా చలమలశెట్టి రమేష్ అత్యధికంగా రూ. 1,21,300 రూపాయలకు దక్కించుకున్నారు.

దీని ప్రాధమిక వెల 30,000 రూపాయలతో కలిపి మొత్తం 1,51,300 రూపాయలకు రమేష్ ఆ నెంబర్ ను సొంతం చేసుకున్నారు. 6667 నెంబర్ ను ఆగిరిపల్లి మండలం శోభనాపురంకి చెందిన డి. శ్రీహర్ష 35 వేల రూపాయలకు, 6669 నెంబర్ ను నూజివీడుకు చెందిన కేవీ రమేష్ కృష్ణ 42,625 రూపాయలకు దక్కించుకున్నారు.

More Telugu News