'తెహల్కా' తేజ్ పాల్ అరెస్ట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'తెహల్కా' తేజ్ పాల్ అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న 'తెహల్కా' పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ ను గోవా పోలీసులు కొద్ది సేపటి క్రితం అరెస్టు చేశారు. గోవా న్యాయస్థానం తరుణ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను తిరస్కరించడంతో పోలీసులు వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. తరుణ్ పిటిషన్ పై ఈ రోజు జరిగిన విచారణ అనంతరం రాత్రి ఎనిమిది గంటలు దాటాక, బెయిల్ పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్టు సెషన్స్ జడ్జ్ అనుజ ప్రభుదేశాయ్ ప్రకటించారు.

More Telugu News