వైయస్ లేఖే రాష్ట్రానికి డెత్ సర్టిఫికేట్ లా మారింది: చంద్రబాబు
దేవేగౌడ ప్రధానిగా ఉన్నప్పుడే బచావత్ ట్రైబ్యునల్ తీర్పు మేరకు కృష్ణా మిగులు జలాలపై హక్కు ఉందని తెలుగుదేశం వాదించిందని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడారు. మిగులు జలాల ఆధారంగానే ఎన్టీఆర్ హయాంలో ప్రాజెక్టులు చేపట్టారని చెప్పారు. వైయస్ రాసిన లేఖే ఇప్పుడు రాష్ట్రానికి డెత్ సర్టిఫికేట్ గా మారిందని విమర్శించారు. ఆల్మట్టి ఎత్తు పెంచితే మన రాష్ట్రానికి జరిగే నష్టంపై సరిగా వాదించలేకపోయారని మండిపడ్డారు. అనంతపురం, మహబూబ్ నగర్ జిల్లాలు వెనుకబడిన ప్రాంతాలని బ్రిజేష్ కుమార్ కు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. బ్రిజేష్ తీర్పు వల్ల రైతులు చితికిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.