చిరకాల స్నేహితురాలిని పెళ్లాడిన క్రికెటర్ పీయూష్ చావ్లా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరకాల స్నేహితురాలిని పెళ్లాడిన క్రికెటర్ పీయూష్ చావ్లా

లెగ్ స్పిన్నర్ పీయూష్ చావ్లా ఒక ఇంటివాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలైన అనుభూతి చౌహాన్ మెడలో గతరాత్రి మూడు ముళ్లు వేశాడు. ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో జరిగిన వివాహ వేడుకకు ఇరు కుటుంబాల వారు, సన్నిహితులతోపాటు క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, భువనేశ్వర్ కుమార్, మాజీ క్రికెటర్, ఎంపీ అజహరుద్దీన్ తదితరులు హాజరయ్యారు. మీరట్ కు చెందిన వైద్యాధికారి అమీర్ సింగ్ చౌహాన్ కుమార్తె అయిన అనుభూతి ఎంబీయే గ్రాడ్యుయేట్. ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండే అనుభూతి, పీయూష్ మంచి స్నేహితులు.

More Telugu News