పెద్ద శేష వాహనంపై విహరించిన పద్మావతి అమ్మవారు
తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు అమ్మవారు తిరు వీధుల్లో పెద్ద శేష వాహనంపై విహరించారు. శ్రీరంగం నుంచి వచ్చిన శ్రీ వైష్ణవులు పద్మావతి అమ్మవారిని పల్లకిలో ఊరేగించారు. శుక్రవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు చిన్నశేష వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో అమ్మవారు ఉదయం, రాత్రి వేళల్లో వివిధ వాహనాల్లో విహరిస్తూ భక్తులకు దర్శనం ఇస్తారు.