బ్రిటన్ లో భారతీయ డాక్టర్ కు ప్రత్యేక గౌరవం
బ్రిటన్ లో వైద్య రంగానికి విశేష సేవలు చేసినందుకు గాను భారతీయ వైద్యుడు జస్విందర్ ఎస్ బామ్రాకు ఏషియన్ లైట్ ప్రొఫెషనల్ ఎక్స్ లెన్స్ అవార్డు లభించింది. జస్విందర్ మాంచెస్టర్ లో సైకియాట్రిక్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి మాంచెస్టర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ అవార్డును జస్విందర్ కు ప్రదానం చేశారు.