డిసెంబర్ 3న రాష్ట్ర కేబినెట్ భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

డిసెంబర్ 3న రాష్ట్ర కేబినెట్ భేటీ

డిసెంబర్ 3న సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. తెలంగాణ ప్రకటన తర్వాత అంటే దాదాపు రెండు నెలల తర్వాత (సెప్టెంబరు 20న) ఈ సమావేశం జరగడం గమనార్హం. విభజన నేపథ్యంలో ఒక్కొక్కొరు ఒక్కో విధంగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తుండటం, మరోవైపు సీఎం సమైక్యవాదం వినిపిస్తున్న నేపథ్యంలో మంత్రివర్గ సమావేశం జరగలేదు. విశేషమేమిటంటే అదేరోజు ఢిల్లీలో కూడా కేంద్ర కేబినెట్ భేటీ జరగబోతోంది. రాష్ట్ర కేబినెట్ భేటీలో అసెంబ్లీ సమావేశాలను ఎప్పట్నుంచి నిర్వహించాలనే విషయంపై కూడా నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.

More Telugu News