కరడుగట్టిన ముగ్గురు మావోల అరెస్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కరడుగట్టిన ముగ్గురు మావోల అరెస్టు

జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. కరడుగట్టిన ముగ్గురు మావోలను అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. జార్ఖండ్ మంత్రి నివాసం, సెల్ ఫోన్ టవర్లు, పోలీసులపై దాడులు, ప్రజలను హతమార్చడం వంటి పలు విధ్వంసాలకు వీరు నేతృత్వం వహించారని తెలిపారు. మావోయిస్టులు వారి కుటుంబ సభ్యులతో ఉండగా అరెస్టు చేసినట్టు చెప్పారు. మావోల అరెస్టును పోలీసులు, భద్రతా సిబ్బంది సాధించిన విజయంగా అభివర్ణించారు. అరెస్టైన మావోల నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని సీజ్ చేశామని, వారిని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

More Telugu News