ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి తీరని అన్యాయం: సీపీఐ నారాయణ
కృష్ణా జలాల పంపకాల వివాదంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వెలువరించిన తుది తీర్పుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. వాదనలు వినిపించడంలో రాష్ట్రం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. తీర్పును పున:పరిశీలించేలా కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరాలని ఆయన సూచించారు.