నాలుగు రాష్ట్రాల్లో విజయం బీజేపీదే: జైట్లీ
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీనే జయకేతనం ఎగరవేస్తుందని అన్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. యూపీఏ కుంభకోణాల పాలన కొనసాగిస్తోందని జైట్లీ దుయ్యబట్టారు.