Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'తెహెల్కా' తేజ్ పాల్ ను జైల్లో పెట్టాలి: బీజేపీ

సహఉద్యోగినిపై లైంగిక దాడికి యత్నించిన తెహెల్కా వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్ పాల్ ను జైలుకు పంపాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును జైలుకు పంపినట్టే, తేజ్ పాల్ ను కూడా పంపాలని బీజేపీ సీనియర్ నేత వీకే మల్హోత్రా అన్నారు. ఆశారాం బాపుకు ఒక న్యాయం, తేజ్ పాల్ కు మరో న్యాయమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తేజ్ పాల్ విషయంలో రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. తెహెల్కాలోని మహిళా ఉద్యోగులు ఒక్కొక్కరే తమ ఉద్యోగాలకు రాజీనామా చేస్తున్నా... కాంగ్రెస్ పార్టీలో చలనం లేదని దుయ్యబట్టారు. తనపై పెట్టిన లైంగిక దాడి కేసు వెనుక గోవాలోని బీజేపీ ప్రభుత్వం, గోవా పోలీసుల ప్రమేయం ఉందంటూ తేజ్ పాల్ ఆరోపించిన అనంతరం మల్హోత్రా ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News