జర్నలిస్టు కానున్న సీఎం కిరణ్!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పెన్ను పట్టాలని ఉందట. అదేంటీ, ఇప్పుడు పట్టడం లేదా? అనుకోకండి. సీఎం భవిష్యత్తులో జర్నలిస్టు అవతారం ఎత్తుతారట. సీఎంగా మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నప్పుడు.. రాష్ట్రం విడిపోతే మీ భవిష్యత్తు ఏంటి? అంటూ ఎదురైన ప్రశ్నకు ఆయన గడుసుగా సమాధానమిచ్చారు. 'రాజకీయాల్లోనే ఉండాలని లేదు కదా. మీ వృత్తిలోకి కూడా రావచ్చు' అంటూ విలేకరులకు షాక్ ఇచ్చారు.