ఎంఎఫ్ హుస్సేన్ 'జీవిత' చిత్రాల ప్రదర్శన
విఖ్యాత చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ తన జీవితంలో పలు దశలను తెలియజేస్తూ ఆయనే స్వయంగా వేసిన చిత్రాలను దుబాయిలో ప్రదర్శిస్తున్నారు. హుస్సేన్ 100వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేస్తున్న ఈ ప్రదర్శన డిసెంబర్ 14 వరకు సావరీన్ ఆర్ట్ గ్యాలరీలో కొనసాగుతుంది. హుస్సేనే వేసిన మరో ఆరు ఇతర చిత్రాలను కూడా ఇందులో ఉంచుతున్నారు. హుస్సేన్ 2011లో మరణించగా.. అంతకుముందు చాలా ఏళ్లు ఆయన దుబాయిలోనే నివసించారు.