ప్రోరోగ్ ఫైల్ ను ప్రభుత్వానికి పంపిన స్పీకర్
అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మండలి ఛైర్మన్ చక్రపాణి ప్రోరోగ్ ఫైల్ ను కొద్దిసేపటి కిందటే ప్రభుత్వానికి పంపారు. ఈ ఫైల్ శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ద్వారా గవర్నర్ కు చేరాల్సి ఉంది. ఇప్పుడా ఫైల్ విషయంలో శ్రీధర్ బాబు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరం.