Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రయాణీకురాలిని వేధించిన కీచక టీసీ

సికింద్రాబాద్ పరిధి రైల్వేలలో టీసీగా పని చేసే రాము ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడి కటకటాలపాలయ్యాడు. లోకల్ ఎంఎంటీఎస్ లో అత్యవసర విధుల నిమిత్తం టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని పట్టుకుని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఫైన్ కడతానని అంటున్నా వినకుండా ఆమె ఫోన్ తీసుకుని మరుసటి రోజు కలవాలని ఆర్డర్ వేశాడు. ఈ ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లిన సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని మరోసారి లైంగికంగా వేధించాడు. దీంతో స్థానిక మహిళలు కీచక టీసీకి బుద్ధి చెప్పి పోలీసులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బేగంపేట పోలీస్ స్టేషన్ లో టీసీని విచారిస్తున్నారు.

More Telugu News