'ప్యాకేజ్' అన్న పదాన్ని పత్రికల్లో ఉపయోగించకూడదు: బొత్స
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ప్యాకేజ్' అన్న పదాన్ని పత్రికల్లో ఉపయోగించకూడదు: బొత్స

రాష్ట్ర విభజన నేపథ్యంలో 'ప్యాకేజ్' అనే పదాన్ని ఈ మధ్య తరచూ వింటున్న సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పదంపై పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్పొరేట్ విధానంలో వాడే 'ప్యాకేజ్' అనే పదాన్ని.. పత్రికల్లో ఉపయోగించకూడదని విజయనగరంలో అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే అందరి ఆకాంక్ష అని, శాసనసభలో విభజన బిల్లును వ్యతిరేకిస్తామని చెప్పారు.

More Telugu News