విశ్వనాథన్ ఆనంద్, కార్ల్ సన్ మ్యాచ్ డ్రా.. ఛాంపియన్ కార్ల్ సన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశ్వనాథన్ ఆనంద్, కార్ల్ సన్ మ్యాచ్ డ్రా.. ఛాంపియన్ కార్ల్ సన్

ప్రముఖ చెస్ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్, కార్ల్ సన్ మధ్య జరిగిన పదో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో 6.5 పాయింట్లు సాధించిన కార్ల్ సన్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ సాధించిన ఆటగాళ్లలో అతి పిన్నవయస్కుల్లో రెండో వాడు కార్ల్ సన్ కావడం విశేషం. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన విశ్వనాథన్ ఆనంద్ ను అసాధారణ ప్రతిభతో ఎటాకింగ్ గేమ్ తో కార్ల్ సన్ కట్టడి చేసి విజయం సాధించడాన్ని విమర్శకులు ప్రశంసిస్తున్నారు.

More Telugu News