Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖ చేరుకున్న భారత్, వెస్టిండీస్ జట్లు

ఎల్లుండి జరగనున్న వన్డే మ్యాచ్ కోసం భారత్, వెస్టీండీస్ జట్లు విశాఖ చేరుకున్నాయి. అక్కడి విమానాశ్రయంలో ఇరు జట్ల ఆటగాళ్లకు ఘన స్వాగతం లభించింది. కాకపోతే, హెలెన్ తుపాను ప్రభావం వల్ల ఈ మ్యాచ్ ఎంత వరకు జరుగుతుందనేది వేచి చూడాల్సిందే. రెండు వన్డేల సిరీస్ లో భారత్ ఇప్పటికే 1-0 తేడాతో లీడ్ లో ఉంది.

More Telugu News