Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'తెహల్కా' తరుణ్ తేజ్ పాల్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

తెహల్కా చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తన సంస్థలో పనిచేసే ఓ మహిళా జర్నలిస్ట్ పై లైంగిక దాడికి ప్రయత్నించిన విషయంలో... తేజ్ పాల్ పై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జాతీయ మహిళా కమిషన్ ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు గోవా పోలీసులకు కమిషన్ లేఖ రాసింది. అంతే కాకుండా తేజ్ పాల్ పై వెంటనే చర్యలను కూడా చేపట్టాలని కోరింది. ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఈ నేపథ్యంలో, కమిషన్ సభ్యులు ఈ రోజు ఉదయం బాధితురాలిని స్వయంగా కలసి వివరాలను తెలుసుకున్నారు. మరోవైపు, తేజ్ పాల్ పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించాలని గోవా ముఖ్యమంత్రి కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో తేజ్ పాల్ ఏ క్షణంలోనైనా అరెస్ట్ కావచ్చని భావిస్తున్నారు.

More Telugu News