Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సౌదీలో 'ఉచిత కౌగిలింతలు' ప్రచారకుల అరెస్ట్

ముస్లిం సంప్రదాయ దేశమైన సౌదీ అరేబియాలో ఇద్దరు యువకులు వింత పోకడలు పోయారు. ఉచిత కౌగిలింతలు అనే బ్యానర్లతో తహ్లియా వీధిలో వచ్చీ పోయేవారిని అలింగనం చేసుకునే కార్యక్రమాన్ని తలపెట్టారు. బహిరంగ ప్రదేశాల్లో ఇలా అలింగనం చేసుకోవడం వల్ల జీవితాలు వెలిగిపోతాయన్నది వారి ఉద్దేశం. కానీ, సంప్రదాయ వాదులు మాత్రం పళ్లు కొరుకుతున్నారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయింది. ట్విట్టర్లో ఒకరు స్పందిస్తూ.. 'ఈ రోజు ఉచిత కౌగిలింతలు. రేపు ఉచిత ముద్దులు. ఎల్లుండి ఉచిత శృంగారం' అంటూ ఎద్దేవా చేశారు. ఈ వ్యతిరేకతతో పోలీసులు ఆ ఇద్దరి యువకులను అరెస్ట్ చేయాల్సి వచ్చింది.

More Telugu News