తుపాను నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లకు సెలవు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తుపాను నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ప్రభుత్వ స్కూళ్లకు సెలవు

'హెలెన్' తుపాను విరుచుకుపడనున్న నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ముందస్తు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అధికారులు ప్రభుత్వ స్కూళ్లకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. తీర ప్రాంతాలైన పల్లెపాలెం, పెడన, తుదివెన్ను, కోడూరు, నాగాయలంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. వారి కోసం 127 పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.

More Telugu News