'ములాయం దేశ భవిష్యత్ ప్రధాని' అంటూ ఎస్పీ ప్రకటనలు
సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నేడు తన 75వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ములాయం భవిష్యత్ ప్రధాని అంటూ ఆ పార్టీ ఉత్తరప్రదేశ్ లోని పలు పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ఈ ప్రకటనలతో పలు పార్టీలు ఆశ్చర్యపోయాయి. ఇదిలావుంటే ఆ పార్టీ ఆధ్వర్యంలోని యూపీ ప్రభుత్వం ఈ రోజు పలు సామాజిక సంక్షేమ పథకాలు కూడా ప్రారంభించనుంది. ములాయం కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ పథకాలను ప్రారంభిస్తారు.