భద్రాచలం తెలంగాణలో భాగమే: కోదండరాం
భద్రాచలం, మునగాల తెలంగాణలో భాగమేనని తెలంగాణ రాజకీయ ఐకాస నేత కోదండరాం తెలిపారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే తమకు కావాలని అన్నారు. హైదరాబాద్ పై సంపూర్ణ అధికారాలు కావాలని, ఎలాంటి ఆంక్షలు విధించరాదని స్పష్టం చేశారు. మునగాల ప్రాంతాన్ని తెలంగాణలోనే ఉంచాలంటూ ఈ రోజు విద్యార్థి జేఏసీ చేపట్టిన పాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రుల పెత్తనం నుంచి విముక్తి కోసమే తెలంగాణ పోరాటమని కోదండరాం వ్యాఖ్యానించారు.