Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వీధిలో లక్ష్మీ మిట్టల్ నివాసం!

ఉక్కు వ్యాపార దిగ్గజం లక్ష్మీ మిట్టల్ లండన్ లోని ఎన్ఆర్ఐలలో అత్యంత ధనవంతుడన్న సంగతి అందరికీ తెలిసిందే. మిట్టల్ నివాసం లండన్ లోని కెన్సింగ్ టన్ ప్యాలెస్ గార్డెన్స్ ప్రాంతంలో ఉంది. ఇప్పుడీ విషయం ఎందుకు చెబుతున్నారు? అనుకుంటున్నారు కదా. అసలు విషయానికి వస్తే.. ఆ కెన్సింగ్ టన్ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వీధుల్లో రెండవదట. ఇక్కడ చదరపు మీటరు స్థలం రూ. 67 లక్షలు (107,000 డాలర్లు) పలుకుతూ ఖరీదైన ప్రాంతాల సరసన నిలిచిందని 'నైట్ ఫ్రాంక్' అనే సంస్థ నివేదిక తెలిపింది. కెన్సింగ్ టన్ ప్రాంతాన్ని లండన్ 'బిలియనీర్స్ రో' అని కూడా పిలుస్తారట. ఇక హాంగ్ కాంగ్ లోని పొల్లాక్ ప్రాంతం చదరపు మీటరు రూ.75 లక్షల (120,000 డాలర్లు) ఖరీదుతో తొలి స్థానంలో నిలిచిందని పేర్కొంది. 'వెల్త్ ఎక్స్-యూబీఎస్ బిలియనీర్ జనగణన 2013' ఈ వివరాలను విడుదల చేసింది.

More Telugu News