Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోనియా అపాయింట్ మెంట్ ఇస్తే వాస్తవాలు చెబుతా: మంత్రి కోట్ల

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఒక్కసారి అపాయింట్ మెంట్ ఇస్తే వాస్తవాలు చెబుతానని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ను వీడే ఆలోచన లేదని చెప్పారు. తాము చెప్పినా వారు వినడం లేదన్న మంత్రి.. జీవోఎం వద్దకు వెళ్లిన ప్రతిసారీ అవమానం జరుగుతోందన్నారు. రాయలసీమను చీల్చాలని తమకెవరికీ లేదన్న కోట్ల.. రాయల తెలంగాణ కావాలని అడగలేదన్నారు. కేవలం నీటి కేటాయింపుల్లో న్యాయం చేయాలని కోరామన్నారు.

More Telugu News