ఈ నెలాఖరుకు మంత్రుల బృందం సిఫారసులు ఖరారు: వీరప్ప మొయిలీ
రాష్ట్ర విభజనపై ఏర్పాటుచేసిన మంత్రుల బృందం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. అన్ని ప్రాంతాల ప్రజలను సంతృప్తి పరిచే పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇరు ప్రాంతాల ప్రజలపై ప్రభావం చూపే అంశాలను పరిశీలించి పరిష్కారం కనుగొనాల్సి ఉందన్నారు. ఈ నెలాఖరుకి మంత్రుల బృందం సిఫారసులను ఖరారు చేస్తామని వెల్లడించిన మొయిలీ... పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.