'పద్మ భూషణ్'కు లియాండర్ పేస్ పేరు సిఫారసు
ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు, డబుల్స్ ఆటగాడు లియాండర్ పేస్ పేరును క్రీడా మంత్రిత్వ శాఖ ఈ ఏడాది పద్మ భూషణ్ పురస్కారానికి సిఫారసు చేసింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఈ ఏడాది ఒక్క పేస్ పేరును మాత్రమే పంపినట్లు ఆంగ్ల పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. చెక్ రిపబ్లిక్ కు చెందిన తన భాగస్వామి ఆటగాడు రదాక్ స్టెప్నాక్ తో కలిసి ఈ ఏడాది ఆగస్టులో 'యూఎస్ ఓపెన్ డబుల్స్' టైటిల్ ను గెలుపొందిన పేస్.. ఎనిమిది గ్రాండ్ స్లామ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. అంతేగాక ఇంతవరకు 53 టైటిళ్లను గెల్చుకున్న పేస్ ను.. 1990లో అర్జున అవార్డు, 97లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, 2001లో పద్మశ్రీ పురస్కారాలతో ప్రభుత్వం సత్కరించింది.