ఆ ఎమ్మెల్యే సంపద రూ. 570 కోట్లు
ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే త్రిభువనేశ్వర్ శరణ్ సింగ్ దేవ్ అత్యంత ధనవంతుడిగా నిలిచారు. సర్గుజ రాజకుటుంబీకుడైన ఆయన సంపద విలువ అక్షరాలా రూ. 570 కోట్లు. ఇందులో రూ. 555 కోట్ల స్థిరాస్తులు, రూ. 10.03 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఈ వివరాలను ఆయన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. గత ఎన్నికల్లో (2008) కూడా ఆయన రూ. 187 కోట్ల ఆస్తులున్నట్టు అఫిడవిట్ లో చూపారు. ఆయన తండ్రి ఎంఎస్ సింగ్ దేవ్ పూర్వపు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.