చుండ్రు సమస్యకు కుంకుడుకాయలే మేలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చుండ్రు సమస్యకు కుంకుడుకాయలే మేలు

మన పెద్దలు కుంకుడుకాయలతో తలంటుకుంటే మంచిదంటారు. కానీ, కుంకుళ్లను కొట్టి, పులుసు తీసి తలంటుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి చిటికెలో అయిపోయే షాంపూలనే ఎక్కువగా వాడుతుంటాం. దీంతో మురికి పోతుందేమోగానీ, రసాయనాలు వాడడం వల్ల దాని ప్రభావం మన వెంట్రుకలపై ఎక్కువగా ఉంటుంది. దీనికితోడు వాతావరణ కాలుష్యం, ఆహారంలో మార్పు ఇలా పలు కారణాల వల్ల ఎక్కువమందిని వేధించే సమస్య డాండ్రఫ్‌. చుండ్రుగా మనం పిలుచుకునే ఈ డ్యాంఢ్రఫ్‌ను తగ్గించుకోవడానికి మళ్లీ మరో కొత్త షాంపూను వాడుతాం. దీంతో వెంట్రుకలు రాలడం ఎక్కువవుతుంది. ఇలా ఒక సమస్యను తగ్గించుకోవడానికి మరో కొత్త సమస్యను సృష్టించుకుంటున్నాం. అలాకాకుండా చక్కగా పాతకాలం పెద్దలు వాడుతున్న కుంకుళ్లను వాడితే కేశాలకు ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

కుంకుడుకాయలతో తలస్నానం చేయడంవల్ల దానిలోని చేదుగుణం తలలోని చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. షాంపూలు తలపైన ఉన్న నూనెలను తొలగించడం వల్ల తల డ్రైగా తయారవుతుంది. ఇలాంటి వాటిని తగ్గించడానికి సీకాకాయ, కుంకుడుకాయలను సమభాగాల్లో తీసుకుని వాటితో తలస్నానం చేయడం వల్ల సమస్యలనుండి బయటపడవచ్చట. కుంకుడుకాయలతో తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడిబారుతుందని కొందరు భావిస్తుంటారు. ఇలాంటివారు కుంకుడుకాయలకన్నా సీకాకాయ పాళ్లు కాస్త పెంచుకుంటే చాలు. మరింత మెరుగైన ఫలితాలను పొందాలనుకుంటే తలస్నానం చేసేముందు చక్కగా తలకు కొద్దిగా కొబ్బరినూనెను పట్టించి, గంట తర్వాత కుంకుడుకాయలతో తలస్నానం చేస్తే మరింత మంచిది.

More Telugu News