ప్రైవేట్ ట్రావెల్స్ పై ఉక్కుపాదం మోపాలి : చిరంజీవి
ప్రైవేట్ ట్రావెల్స్ పై ఉక్కుపాదం మోపాలని కేంద్ర మంత్రి చిరంజీవి సూచించారు. ఈ మేరకు సీఎం కిరణ్ కు ఆయన లేఖ రాశారు. ప్రైవేట్ ట్రావెల్స్ మాఫియాలా అవతరించాయని లేఖలో చిరంజీవి తెలిపారు. వీరి ఆగడాలను అరిక్టటడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.