ఐటీ కంపెనీలకు నిరంతరాయ విద్యుత్తు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐటీ కంపెనీలకు నిరంతరాయ విద్యుత్తు

ఐటీ కంపెనీలకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తామని మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ ఆధ్వర్యంలో సచివాలయంలో ఐటీ శాఖ సమీక్ష జరిగింది. ఐటీ కంపెనీలకు అన్ని వేళలా విద్యుత్తు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా విద్యుత్తు శాఖ అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని అనంతరం పొన్నాల మీడియాకు తెలిపారు. చిన్న పట్టణాలలో ఐటీ కంపెనీలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే రాయితీలు ఇస్తామని ప్రకటించారు. 

More Telugu News