నేడు ఢిల్లీకి వెళ్లనున్న టీకాంగ్ నేతలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేడు ఢిల్లీకి వెళ్లనున్న టీకాంగ్ నేతలు

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈ రోజు జీవోఎం ముందుకు వెళ్లనున్నారు. ఇందులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉంటారు. జీవోఎంతో భేటీ సందర్భంగా ఆంటోనీ కమిటీ సిఫారసుల్లో మార్పుచేర్పులు కోరుతామని వారు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంపిన సిఫారసులు ప్రభుత్వ సిఫారసులైతే వాటిని పరిగణనలోకి తీసుకోవద్దని సూచించనున్నారు. సమాచారం నిమిత్తమే వివరాలు పంపి ఉంటే తమకు అభ్యంతరం లేదని, ప్రభుత్వ పరంగా పంపాల్సి వస్తే మంత్రి వర్గం కూర్చొని చర్చించాకే పంపాలని డిమాండ్ చేశారు. రెండు రాష్ట్రాలుగా విడిపోతున్న దశలో తాము పదవుల్ని కోరుకోవడం లేదని, అందుకే నాయకత్వ మార్పు అవసరం లేదని వారు అన్నారు.

More Telugu News