కొత్తరకం పరుగుతో రికార్డు కొట్టాడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొత్తరకం పరుగుతో రికార్డు కొట్టాడు

మామూలుగా అయితే మనం ఎలా పరుగెత్తుతాం... చక్కగా కాళ్లతో పరుగెత్తుతాం. మరి పరుగెత్తడానికి కాళ్లేకాకుండా చేతులను కూడా ఉపయోగిస్తే... సరిగ్గా ఇలాగే పరుగెత్తి ఒక వ్యక్తి చక్కగా గిన్నిస్‌ బుక్‌లో చోటు సంపాదించేశాడు.

జపాన్‌కు చెందిన కెనిచీ ఇటో అనే వ్యక్తి కాళ్లూ, చేతులతో పరుగెత్తడం ప్రాక్టీస్‌ చేశాడు. ఈ ప్రాక్టీస్‌ ఎంతగా చేశాడు అంటే వంద మీటర్ల దూరాన్ని కేవలం 16.87 సెకండ్లలో పూర్తి చేశాడు. కెనిచీ పరుగు వేగాన్ని గుర్తించిన గిన్నిస్‌ బుక్‌ వారు కెనిచీకి గిన్నిస్‌ బుక్‌లో చోటు కల్పించారు. మరో విశేషమేమంటే, గతంలో ఇలా పరుగెత్తిన రికార్డు కూడా కెనిచీ పేరుమీదే ఉంది. గతంలో 17.47 సెకండ్లలో వంద మీటర్ల దూరాన్ని అధిగమించిన తన రికార్డును ఇప్పుడు తానే మళ్లీ తిరగరాసుకున్నాడు.

More Telugu News