సీబీఐ వల్లే యూపీఏ నడుస్తోంది: మోడీ
యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులోని మెజారిటీతో కాకుండా, సీబీఐ అండతో నడుస్తోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు. మాట వినని వారిపై సీబీఐని ప్రయోగించడం కాంగ్రెస్ కు రివాజుగా మారిందని మండిపడ్డారు. తనపై కూడా సీబీఐని ప్రయోగించి బెదిరించాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. మహాత్మాగాంధీ, సర్ధార్ పటేల్ పుట్టిన గడ్డపై పుట్టిన తాను ఎవరికీ భయపడనని అన్నారు. ఛత్తీస్ గఢ్ లోని దుర్జ్ లో ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ, ధరల పెరుగుదల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. టీ అమ్మిన కుర్రాడు ప్రధాని అవుతాడా అని అంటున్నారని... తమను రాజవంశీకులుగా భావించుకుంటున్న వారు ఇలా మాట్లాడడం, పేదలను అవహేళన చేయడమేనని మోడీ ఎద్దేవా చేశారు.