శ్రీలంక చేరుకున్న ఖుర్షీద్
భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కామన్ వెల్త్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ (చోగం)లో పాల్గొనడానికి శ్రీలంక రాజధాని కొలంబో చేరుకున్నారు. ఐదు రోజుల పాటు ఆయన శ్రీలంకలో పర్యటించనున్నారు. ఖుర్షీద్, విదేశాంగ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్ ఈ ఉదయం ప్రత్యేక విమానంలో శ్రీలంక చేరుకున్నారు. ఆయనకు శ్రీలంక పౌర విమాన యాన శాఖ సహాయ మంత్రి గుణరత్నే స్వాగతం పలికారు. తమిళులకు సంబంధించిన పలు విషయాలపై చర్చించేందుకే తానీ సమావేశాలకు హాజరవుతున్నానని ఖుర్షీద్ తెలిపారు.