ఇలా కూడా గుండెపోటు వస్తుందట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇలా కూడా గుండెపోటు వస్తుందట!

మనం ఇళ్లలో వెలిగించే విద్యుత్తు దీపాల్లోను, కంప్యూటర్లలోను వాడే ఒక లోహం వల్ల కూడా గుండెపోటు వచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అదేమంటే టంగ్‌స్టన్‌! ఈ లోహం మన శరీరంలోకి ఎలా చేరుతుంది? అని మీకు సందేహమా... ఎలాగంటే దీని సూక్ష్మ రేణువులు గాలిలో కలిసిపోతే ఆ గాలిని పీల్చడం ద్వారాను, వ్యర్థాల రూపంలో పొలాల్లో కలవడం ద్వారా ఇలా పలు రకాలుగా ఈ లోహం మన శరీరంలోకి చేరుతోందట. దీని ఫలితంగా మనకు గుండెపోటు వచ్చే ప్రమాదముందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.

యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటర్‌కు చెందిన పరిశోధకులు టంగ్‌స్టన్‌ లోహం మన శరీరంలో హెచ్చు స్థాయిలో ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదముందని తాజాగా నిర్వహించిన పరిశోధనలో తేల్చారు. ఈ లోహం వస్తూత్పత్తి సమయంలో సూక్ష్మ రేణువులు గాలిలోనూ, వ్యర్ధాల రూపంలో పొలాల్లోను కలుస్తుందట. అలాగే మనం వాడే కొన్ని రకాల సౌందర్య సాధనాల్లోనూ ఈ లోహం ఉంటుందట. ఇలా పలు రూపాల్లో మన శరీరంలోకి ప్రవేశించి మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందట.

ఈ లోహం మనిషి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకోవడానికి 18-74 ఏళ్ల వయసున్న 8,614 మంది ఆరోగ్య సమాచారాన్ని 12 ఏళ్లపాటు పరిశోధకులు విశ్లేషించారు. అమెరికాకు చెందిన జాతీయ ఆరోగ్య, పౌష్టికాహార పరిశోధనా సర్వే ఈ మేరకు సమాచారాన్ని అందించింది. ఈ లోహం కారణంగా 50 ఏళ్లలోపు వయసున్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం రెండింతలు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

More Telugu News