దైవ దర్శనానికి వెళ్లిన బాలికను నిర్బంధించి అత్యాచారం
అక్క ఇంటికి వచ్చి, అదృశ్యమైన మైనర్ బాలిక కేసు మలుపు తిరిగింది. బాలిక ఇంటికి చేరడంతో కేసు ముగిసినా... కొత్త కోణం వెలుగు చూసింది. నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలానికి చెందిన ఓ మైనర్ బాలిక అదే మండలంలోని అర్వపల్లిలో ఉన్న తన అక్క దగ్గరకు ఈ నెల 1న వచ్చింది. అక్కడ తన అక్కను కలిసి తిరిగి ఇంటికి బయల్దేరింది.
అయితే, నేరుగా ఇంటికి వెళ్లకుండా నార్కట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీజడల రామలింగేశ్వర స్వామి దేవాలయ దర్శనానికి వెళ్లింది. అక్కడ ఆమెకు కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం వట్టెముల గ్రామానికి చెందిన కొర్రెపు రమేష్ పరిచయమయ్యాడు. అతను మాయమాటలు చెప్పి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి నిర్బంధించి వారం రోజులు పాటు లైగింక దాడికి పాల్పడ్డాడు. చివరకు బాలిక ఎలాగోలా తప్పించుకుని ఇంటికి చేరుకుని జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది.
దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై నిర్భయ కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్టు చేసి తుంగతుర్తి కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు రమేష్ చెరువుగట్టు దేవాలయం వద్ద కొబ్బరి కాయల దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు.