హైదరాబాద్ ను యూటీ చేయడానికి ఒప్పుకోం : నారాయణ
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను యూటీ చేసే ప్రతిపాదనకు తాము పూర్తిగా వ్యతిరేకమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. హైదరాబాద్ యూటీ అయితే ఇక్కడ ఓ చిన్న గోడ కట్టాలన్నా కేంద్రం అనుమతి తీసుకోవాలని అన్నారు. దీనికితోడు, భద్రాచలంను తెలంగాణలో భాగంగానే ఉంచాలని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన చేస్తున్న కేంద్ర ప్రభుత్వమే... విభజనతో వచ్చే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరి కాసేపట్లో నారాయణ జీవోఎంతో భేటీ కానున్నారు.