Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఒత్తిడి పెరిగితే మతిమరుపు వస్తుంది

నేటి యువత ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నారు. అటు ఉద్యోగం, ఇటు ఇల్లు అంటూ ఎక్కువ ఒత్తిడికి గురయ్యేది మహిళలే. ఒత్తిడి వల్ల ఆరోగ్యానికి నష్టం కలుగుతుందని తెలిసినా తప్పడంలేదు. ఇప్పుడు ఒత్తిడి వల్ల కేవలం ఆరోగ్యమేకాదు... మన జ్ఞాపకశక్తి కూడా నశించే ప్రమాదముందని పరిశోధకులు చెబుతున్నారు.

మనుషుల్లో ఒత్తిడి అనేది జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపుతుందని గతంలో తేలినా లండన్‌లోని వివిధ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ఈ విషయంలో నత్తలపై పరిశోధనలు చేశారు. ఈ పరిశోధనల్లో వాటికి పలు అంశాల్లో ముందుగా శిక్షణనిచ్చారు. తర్వాత వాటిని గాల్లోనుండి కాకుండా కేవలం నీటిలోని ఆక్సిజన్‌ను మాత్రమే తీసుకునేలా వాటిపై మానసిక ఒత్తిడిని పెంచారు. ఈ ఒత్తిడి నత్తల జ్ఞాపకశక్తిపై తీవ్ర ప్రభావం చూపించినట్టు వారు గుర్తించారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక అవి ఏకంగా వాటికి నేర్పించిన విషయాలను కూడా మర్చిపోయాయని పరిశోధకులు గుర్తించారు. నిజజీవితంలో మనుషులతోబాటు ఒత్తిడి అనేది ఇతర జీవుల మెదడుపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే విషయం తెలుసుకోవడానికి తాము పరిశోధనలు చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

More Telugu News