Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఉత్తమ ఎయిర్ పోర్టు అవార్డు

హైదరాబాద్, శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్టు(ఆర్టీఐఏ)కి ఉత్తమ 'కార్గో ఎయిర్ పోర్టు' అవార్డు లభించింది. జైపూర్ లో జరిగిన ఎయిర్ కార్గో ఏజెంట్స్ అసోసియేషన్ 40 వ వార్షిక సమావేశంలో ఈ అవార్డును శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ప్రకటించారు. ఈ అవార్డుకు ఎంపిక కావడం వరుసగా ఇది రెండోసారి అని జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ వ్యాఖ్యానించింది. తమ సంస్థ చిత్తశుద్ధి, అంకిత భావం, సేవలకు ప్రతిరూపమే ఈ అవార్డు అని సీఈవో ఎస్ జీకే కిశోర్ అన్నారు.

More Telugu News