పూటుగా తాగి చితక్కొట్టుకున్న మహిళలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పూటుగా తాగి చితక్కొట్టుకున్న మహిళలు

పూటుగా తాగారు.. మద్యం మత్తులో మాటా మాటా పెరిగింది. అది కాస్త కొట్లాట వరకు వెళ్లింది. అంతే... నడి రోడ్డుమీద చితక్కొట్టుకున్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ లోని ఓ కల్లు కాంపౌండ్ లో కొందరు మహిళలు ఫుల్లుగా కల్లు తాగారు. ఈ సమయంలోనే ప్రక్కనే ఉన్న మరికొందరు మహిళలతో వాగ్వాదం జరిగింది. చిలికిచిలికి గాలివానలా మారిన గొడవ కాస్తా కొట్టుకునే వరకు వచ్చింది. అంతే... మద్యం మత్తులో మహిళలు ఒకరి జుత్తులు ఒకరు పట్టుకుని నడి రోడ్డు మీద చితక్కొట్టుకున్నారు. దీంతో పొలీసులు రంగప్రవేశం చేసి మహిళలను అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు జనావాసాల మధ్య కల్లుకాంపౌండ్ నిర్వహణపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News