సచిన్ 200 టెస్టుకు ఆన్ లైన్ లో నేటినుంచి టికెట్లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సచిన్ 200 టెస్టుకు ఆన్ లైన్ లో నేటినుంచి టికెట్లు

మాస్టర్ బ్లాస్టర్ 200వ టెస్టు మ్యాచ్ కు ఆన్ లైన్ లో నేటినుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ముంబయిలోని వాంఖెడే స్టేడియం వేదికగా ఈ నెల 14 నుంచి 18 వరకు టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత్- దక్షిణాఫ్రికా మధ్య ఈ రెండో టెస్టు జరగనుంది. kyazoonga.Com వెబ్ సైట్ లో ఈ టికెట్లను అభిమానులు ముందుగానే రిజర్వ్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తికి రెండు టిక్కెట్లు మాత్రమే కొనుగోలుకు అవకాశం ఉంటుందని ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎమ్ సీఏ) తెలిపింది. మొత్తం 3వేల టిక్కెట్ల బుకింగ్ ను చేపట్టిన ఎమ్ సీఏ.. రూ. 500, రూ.1,000, రూ. 2,500 టికెట్లను అమ్ముతోంది. అంతేగాక, అధిక మొత్తంలో ప్రత్యేక టికెట్లు కూడా అమ్ముతోంది.

More Telugu News