Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కూల్‌డ్రింక్స్‌తో కిడ్నీలకి ముప్పు

కూల్‌డ్రింక్స్‌ ఆరోగ్యానికి మంచిది కాదని ఇప్పటికే ఎందరో పరిశోధకులు చెబుతున్నా మరోవైపు కూల్‌డ్రింక్‌ కంపెనీలు మాత్రం తమ కంపెనీలో తయారైన ఫలానా కూల్‌డ్రింక్‌ తాగడం వల్ల ఉత్సాహం వస్తుందని, శక్తి వస్తుందని ఇలా ఏవేవో అదరగొట్టే ప్రకటనలతో హోరెత్తిస్తుంటాయి. అయినా శాస్త్రవేత్తలు కూల్‌డ్రింక్స్‌ తాగడం వల్ల కిడ్నీలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని మరోసారి హెచ్చరిస్తున్నారు.

కూల్‌డ్రింక్స్‌లో ఉండే చక్కెరతో మూత్రపిండాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని జపాన్‌కు చెందిన ఒసాకా విశ్వవిద్యాలయ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించారు. ఇందులోని చక్కెర మూత్ర పిండాల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతున్నట్టు వీరి అధ్యయనంలో తేలింది. రోజుకు కనీసం రెండు కూల్‌డ్రింక్స్‌ తీసుకునే వారిలో ప్రొటీనూరియా లేక మూత్రంలో ప్రోటీన్ల విసర్జన ఎక్కువగా జరుగుతున్నట్టు వీరు తమ అధ్యయనంలో గుర్తించారు. కాబట్టి కూల్‌డ్రింక్స్‌ తాగేటప్పుడు కాస్త ఆలోచించి తాగండిమరి.

More Telugu News