ఎంపీ ప్రవర్తనపై కేరళ సీఎంకు వివరించిన శ్వేతామీనన్
మలయాళ నటి శ్వేతామీనన్ కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని కలిశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటనకు సంబంధించిన వివరాలను ఆయనకు తెలిపినట్టు చెప్పారు. ఇటీవల కొల్లాంలో జరిగిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ, 73 ఏళ్ల పీతాంబర కురుప్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆమె ఆరోపించిన సంగతి తెలిసిందే. అనంతరం కురుప్ పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసి, ఆయన వయసును గౌరవించి కేసును ఉపసంహరించుకున్నట్టు ఆమె ప్రకటించారు.